Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త పార్లమెంటుపైనా అన్ని పార్టీలతో చర్చించి కేంద్రం నిర్ణయించాలి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి - కరీంనగర్
తెలంగాణ నూతన సచివాలయాని కి బారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టడం ప్రశంసనీయమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగ నిర్మాత, రచనతో పాటు కులం, కుల నిర్మూలన కోసం అంబేద్కర్ జీవితాంగం పోరాడిన మహానాయకుడని తెలిపారు. అనేక వివక్షతలు, అణచివేతలు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఆయన అనుకున్న లక్ష్యాలు సాధించడం కోసం మంత్రి పదివే వదులుకున్న త్యాగపురుషుడని పేర్కొన్నారు. ఇప్పుడు అంబేద్కర్ మిగిల్చిన ఆశయాలను ముందుకుతీసుకుపోవడం కులనిర్మూలన కోరుకునే శక్తులన్నింటిపైనా ఉందని సూచించారు. బీజేపీ ప్రభుత్వంలో రాజ్యాంగ మూలవిలువలైన లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక సార్వభౌమత్వం, సామాజిక న్యాయం, రాష్ట్రాల హక్కులపై దాడి జరుగుతున్నదని విమర్శించారు. ప్రస్తుతం కొత్త పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలన్న చర్చ జరుగుతున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ముందుకొచ్చి కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలన్న నిర్ణయం గొప్ప విషయమని పేర్కొన్నారు. దీన్ని తమ పార్టీ రాష్ట్ర కమిటీ అభినందిస్తున్నదని తెలిపారు. ఇది చూసైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని పార్టీలతో చర్చలు జరిపి ఒప్పించి కొత్త పార్లమెంటు భవనానికి పేరును నిర్ణయించాలని డిమాండ్ చేశారు.
సాయుధ రైతాంగ పోరాటాన్ని వక్రీకరిస్తే సహించం..
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని వక్రీకరిస్తే సహించబోమనీ, బీజేపీ మోసపూరిత ప్రకటనలు మానుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలంగాణ సాయుధ పోరాటానికి కమ్యూనిస్టులు నాయకత్వం వహించారని గుర్తుచేశారు. బాంచన్ దొర అనే వారితో బందూకులు పట్టించి మూడువేల గ్రామాలను విముక్తి చేశారని తెలిపారు. 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు స్వాధీనం చేసారని పేర్కొన్నారు. జాగిర్దారు, జమీందారు, నైజాం దుశ్చర్యలను, రజాకార్ల దౌర్జన్యాలను ఎదిరించి పోరాడి నాలుగువేల మంది బలిదానాలైన చరిత్ర కమ్యూనిస్టులదని తెలిపారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర తెలుసుకోకుండా ఆ పోరాటాన్నే వక్రీకరించి మాట్లాడడం బీజేపీకి తగదనీ, తప్పుడు ప్రకటనలు, చెత్తవాగుడు మానుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం టీవీ9లో బీజేపీి నాయకుడు ప్రకాష్ రెడ్డి ''కమ్యూనిస్టులు- రజాకార్లు కలిసి సభ జరిపారనీ, దానికి రాజ బహదూర్ గౌర్ హాజరయ్యారనీ, నైజాం రాష్ట్రం ప్రత్యేకంగా ఉండాలని అతను డిమాండ్ చేసినట్టు'' తప్పుడు మాటలు మాట్లాడటవం తగదన్నారు. బ్రిటిష్ వారికి, రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర గాడ్సే వారసత్వమైన బీజేపీకిి లేదని తెలిపారు. రాచరిక వ్యవస్థను గొప్పగా చెప్పుకుంటూ, ఛత్రపతి శివాజీ లాంటి వారికి మతం రంగు పులుముతూ, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని, తెలంగాణ విలీనాన్ని వక్రీకరిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ, మనువాదాన్ని ముందుకు తెస్తున్నారని గుర్తుచేశారు. చరిత్రపై ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తున్న బీజేపీ చర్యలను విజ్ఞులైన తెలంగాణ ప్రజలు గుర్తించాలనీ, తీవ్రంగా ఖండించాలని విజ్ఞప్తి చేశారు.