Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఆర్ ఇంజినీర్ ఇన్ చీఫ్ సంజీవరావు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ప్రముఖ ఇంజినీర్, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టిన రోజు నేపథ్యంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖలో 55వ ఇంజినీర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిభిరం చేపట్టారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎజీ సంజీవరావు మాట్లాడుతూ 30 మంది ఇంజినీర్లు, ఉద్యోగులు, సిబ్బంధి పాల్గొని రక్తదానం చేయడం సేవాభావానికి నిదర్శనమన్నారు. మోక్షగుండం విశ్వేశ్వర్యయ్య పుట్టినరోజున రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మంచి పరిణామమని తెలిపారు. విశ్వేశ్వరయ్య ప్రపంచఖ్యాతిగాంచిన ఇంజినీర్ అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో అందరూ పనిచేయాలని సూచించారు. ప్రపంచాన్ని నిర్మించే శక్తి ఇంజినీర్లకు ఉందని వ్యాఖ్యానించారు. సైన్స్ కొత్త విషయాలను తెలుసుకుంటే, ఇంజినీరింగ్ కొత్త పనులు చేయడానికి ఉపయోగపడుతుందని వివరించారు. అందుకే ప్రపంచాన్ని ఇంజినీర్లు నిర్మిస్తారనే నానుడి ప్రచారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ జి.సీతారాములు, మిషన్ భగీరథ సీఈలు మధుబాబు, లలిత, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్ల సంఘం అధ్యక్షులు రాకేష్, పంచాయతీరాజ్ ఇంజినీర్ల సంఘం ఉపాధ్యక్షులు గంజి నరేంద్రప్రసాద్, డీఈ రజిత తదితరులు పాల్గొన్నారు.