Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల మధ్య చిచ్చుపెట్టొద్దు..
- స్వాతంత్య్రోద్యమంలో బీజేపీ పాత్ర ఉందా? :
'విలీనమా?విమోచనమా'? రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ప్రజల మధ్య ఐక్యతకు చిచ్చుపెడుతున్న బీజేపీ పట్ల అప్రమత్తం గా ఉండాలని పలువురు వక్తలు పిలుపు నిచ్చారు. తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ పిడమర్తి రవి అధ్యక్షతన 'సెప్టెంబర్ 17 జరిగింది విలీనమా? విమోచనమా? అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే డి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ బీజేపీ, దాని పరివారా నికి తెలంగాణ సాయుధ పోరాటంతో అసలు సంబంధమే లేదన్నారు. దేశ స్వాతంత్య్రోద్యమం లో ఆ పార్టీ విద్రోహ పాత్ర పోషించనట్టుగా చరిత్ర చెబుతున్నదని తెలిపారు. కానీ..బీజేపీ నేతలు చరిత్రను వక్రీకరించి మాట్లాడుతున్నారని విమర్శించారు.కమ్యూనిస్టుల పోరాట ఫలితం గానే స్వాతంత్య్ర భారత దేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైందన్నారు. ఈ అంశంలో నెహ్రూ ప్రభుత్వంలో హోం మంత్రిగా ఉన్న వల్లభాయి పటేల్‌ను వేరు చేసి చూడటమేంటని ప్రశ్నించారు. ప్రజల మధ్య అనైక్యతను సృష్టించి రాజకీయ లబ్దిపోందాలని భావిస్తున్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నర్సింహారావు మాట్లాడుతూ సంఫ్‌ుపరివార్‌కు స్వాతంత్రోద్య మంలో వారికి ఎలాంటి పాత్ర లేదని చెప్పారు. గాంధీని చంపిన గాడ్సేవారసులు దేశభక్తులు ఎలా అవుతారని ప్రశ్నించారు. రాజకీయ లబ్ది కోసం మతవిద్వేషాలను రెచ్చగొట్టటం తగదన్నా రు. ప్రజాస్వామ్య హక్కుల్ని హరించటమే గాక..ప్రశ్నించినవారిని దేశద్రోహులగా చిత్రిస్తూ.. నియంతృత్వ పోకడలకు తెరలేపారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో పొందుపర్చిన స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం అనే అంశా లకు అర్థం లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ నూతన విద్యావిధానంతో చరిత్రను చెరిపేసే కుట్రకు ఆర్ఎస్ఎస్ దాని పరివారం తెర లేపిం దని చెప్పారు. దేశద్రోహులే..దేశభక్తులుగా చలా మణి అవుతున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను అత్యంత దారుణంగా కూలదోస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విలువల పట్ల వీరికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. తెలం గాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మెన్ గజ్జెల కాంతం మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా సెప్టెంబర్ 17న నైజాం ప్రభుత్వం భారత యూనియన్‌లో విలీనమైందని చెప్పారు. దీనికి బీజేపీ దాని మతోన్మాద శక్తులు వక్రభాష్యాలు చెబుతున్నాయన్నారు. ప్రజాసమస్యలను ఎజెండా నుంచి తప్పించి..వారి మధ్య భావావేశాలను పెంచేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. మతకొట్లాటలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని కొందరు చూస్తున్నారన్నారు. తెలంగాణలో వారి పప్పులుడకవని హెచ్చరిం చారు. పశ్య పద్మ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి కమ్యూనిస్టులే వారసులన్నారు. భూమి కోసం వెట్టిచాకిరి నుంచి విముక్తికోసం ఆ పోరాటం సాగిందన్నారు. ప్రొఫెసర్ ఖాసీం మాట్లాడుతూ దేశంలో సంఫ్‌ుపరివారం ప్రధాన పనేంటంటే..రాజ్యాంగ విలువల్ని పాతరేయటం,ప్రజాస్వామ్యాన్ని కాలరా యటమేనని విమర్శించారు. ప్రస్తుత రాజ్యాంగం స్థానంలో మనుధర్మ సూత్రాల ఆధారంగా పాలన కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన కాదు.. జాతీయ సమైక్యత దినోత్సవం అని తెలంగాణ రాష్ట్ర మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్కు ఎలాంటి సంబంధం లేదనీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోనూ, సాయిధ పోరాటంలోనూ వారు పాల్గొనలేదని చెప్పారు. ఈ విషయంలో జాతీ య, రాష్ట్ర నాయకత్వం కావాలనే రాజకీయం చేస్తున్నదని విమర్శించారు. ఉత్తరాది సంస్కృతిని దక్షిణ భారతదేశంపై రుద్దాలని ప్రయత్నం చేస్తే చైతన్యవంతమైన తెలంగాణ గడ్డ ఊరుకోబోదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ జనసభ అధ్యక్షులు రాజారాం యాదవ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్యపద్మ,బీసీ సంఘాల నేతలు వెంకటేశం గౌడ్, మేకపోతు నరేందర్‌గౌడ్ ప్రసంగించారు. చివరగా పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరును పెట్టాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు.