Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేనేత అమ్మకాలు, వస్తువులపౖౖె జీఎస్టీ ఎత్తేయాలి: చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-చౌటుప్పల్
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన చేనేత సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని, చేనేత అమ్మకాలు, వస్తువులపై విధించిన జీఎస్టీని జీరో శాతం చేయాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. చేనేతపై విధించిన జీఎస్టీని జీరో శాతం చేయాలనే అంశంపై గురువారం యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో సంఘం జిల్లా అధ్యక్షులు గుర్రం నర్సింహ అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చెరుపల్లి మాట్లాడుతూ.. చేనేత బోర్డును కొనసాగించాలని, ఆరోగ్యబీమా, బున్కర్ బీమాయోజన, ఎండీఏ వంటి పథకాలను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత వస్త్రాల అమ్మకాలపై విధించిన 26శాతం జీఎస్టీని జీరో చేయాలని డిమాండ్ చేశారు. జీరో జీఎస్టీ సాధించేందుకు పాదయాత్ర నిర్వహించనున్నట్టు సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు గంజి మురళీధర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.శంకరయ్య, జిల్లా గౌరవాధ్యక్షుడు గోశిక స్వామి, ఆప్కో మాజీ డైరెక్టర్ గర్దాసు బాలయ్య, అసోసియేషన్ అధ్యక్షులు కందగట్ల బిక్షపతి, డీసీసీబీ డైరెక్టర్ జూలూరు శ్రీనివాస్, బడుగు మాణిక్యం, బడుగు లక్ష్మయ్య, పద్మశాలి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బీరందాసు ధనుంజయ్య, బొల్ల విఠల్, కోడెం బాలనర్సింహ, అంజయ్య, గంజి భారతమ్మ, గంజి రామచంద్రం, నల్ల రమేశ్, భీమయ్య, జహంగీర్, కిషన్, రవికుమార్, జనార్దన్ పాల్గొన్నారు.