Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలికపై సామూహిక లైంగికదాడి
- హోటల్లో బంధించి, మత్తు మందిచ్చి..
- ఇద్దరు నిందితుల అరెస్ట్
నవతెలంగాణ-ధూల్ పేట్
హైదరాబాద్ నగరం పాతబస్తీలో మరో ఘోర ఘటన వెలుగుజూసింది.. ఓ బాలికను ఇద్దరు యువకులు హోటల్లో బంధించి, మత్తు మందు ఇచ్చి సామూహిక లైంగికదాడి చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుజూసింది.. డబీర్పురా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పాతబస్తీకి చెందిన బాలిక(14) ఈనెల 13న రాత్రి 7 గంటల సమయంలో కిరాణాషాపుకు వెళ్లింది. ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. మరుసటి రోజు బాలిక ఇంటికి చేరుకుంది. ఎక్కడికెళ్లావని తల్లి ప్రశ్నించింది. తనను ఇద్దరు యువకులు ఓయో లాడ్జీకి తీసుకెళ్లి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆ తర్వాత నాలుగు మాత్రలు వేశారని ఏడుస్తూ చెప్పింది. బలవంతంగా మద్యం తాగించారని, టార్చర్ పెట్టారని ఆ తర్వాత స్పృహ కోల్పోయానని చెప్పి బోరుమన్నది. మరుసటిరోజు స్పృహలోకి వచ్చిన తనపై నీళ్లు పోశారని వివరించింది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో అని బెదిరించారని తెలిపింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఈనెల 14న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని భరోసా సెంటర్కు తరలించారు.అయితే బాలికను కిడ్నాప్ చేశారా? లేదా మాయమాట లతో తీసుకెళ్లారా? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.