Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అటవీ శాఖలో పనిచేస్తున్న ఆరుగురు అసిస్టెంట్ కన్జర్వేట్ ఆఫ్ ఫారెస్ట్(ఏసీఎఫ్) అధికారులకు డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(డీసీఎఫ్) అధికారులుగా పదోన్నతులు లభించాయి. గురువారం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. పదోన్నతులు పొందిన వారిలో విజిలెన్స్ డీఎఫ్ఓ డి.సుధాకర్‌రెడ్డి, నిజామాబాద్ ఎఫ్డీఓ కె.రామకృష్ణ, జన్నారం ఎఫ్డీఓ ఎస్.మాధవరావు, దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ వి.ఆంజనేయులు, మహబూబాబాద్ ఎఫ్డీఓ పి.కృష్ణమాచారి, వికారాబాద్ డీఎఫ్ఓ డివిరెడ్డి ఉన్నారు. వారు ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల్లోనే కొనసాగుతారు.