Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో అయిదుగురు రోహింగ్యాలను అరెస్టు చేసి జైల్లో నిర్బంధించడం అన్యాయమనీ, వెంటనే వారిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు గురువారం ఆదేశించింది. కింది కోర్టు వారికి బెయిల్ ఇచ్చినా తుది తీర్పు వెలువడే వరకు వాళ్లను నిర్బంధంలోనే ఉంచే విధంగా ప్రభుత్వం గత ఏడాది 541, 538, 593, 540, జీవోలను జారీ చేసింది. దీంతో రెహముల్లా, జాఫర్ ఆలమ్ అలియాస్ మహమద్ సాజిద్, అబ్దుల్ అజీజ్, నూర్ ఖాసీం అలియాస్ మహ్మద్ నూర్, నాజర్ ఉల్ ఇస్లామ్‌లు చర్లపల్లి జైల్లోనే ఉన్నారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంటూ వారి బంధువులు దాఖలు చేసిన కేసుల్లో న్యాయమూర్తులు జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ వేణుగోపాల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది.