Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రపై గవర్నర్‌తో చర్చకు సిద్ధంగా ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజాం రాచరికానికి, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాగిన పోరాట వాస్తవ చరిత్రను తెలుసుకునేందుకు... కమ్యూనిస్టు పార్టీ వారసులుగా తమతో గవర్నర్ చర్చకు రావాలని కోరారు. మహత్తరమైన నాటి పోరాటంపై గవర్నర్ తమిళి సై ఆమె తన పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ బీజేపీ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
పదవీ ఔన్నత్యాన్ని అగౌరవ పరుచుకుంటున్నారని తెలిపారు. గౌవర్నర్ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలనీ, నాటి పోరాటానికి నేతృత్వం వహించిన వీరయోధులు రచించిన పుస్తకాలను బహుమానంగా ఇస్తామని పేర్కొన్నారు. అది విమోచనం కాదు, హిందూ ముస్లిం పోరాటం అంతకంటే కాదని రుజువు చేస్తామని తెలిపారు. చర్చించేందుకు తమకు సమయం ఇవ్వకపోతే, రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.