Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన మేరకు విద్యార్థులు యువకులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, లయన్ సభ్యులు, మహిళలు ర్యాలీ నిర్వహించారు. శ్రీ రమణ చౌరస్తా నుంచి ర్యాలీ ప్రారంభమై అంబర్పేట్ గాంధీ విగ్రహం వరకు సాగింది. భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే, నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి అంబేద్కర్ పేరును నిర్ణయించింనందుకు కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మావతి డిపి రెడ్డి (అంబర్పేట నియోజకవర్గం), శ్రీనివాస్, కిషోర్, విజయ్ దేవరుప్పల, శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు.