Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'జయహో మంత్రి జగదీశ్‌రెడ్డి' అంటూ నినదించిన ఎస్పీ
నవతెలంగాణ-సూర్యాపేట
సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ అత్యు త్సాహం ప్రదర్శించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలం రగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను భారీ ఎత్తున నిర్వహించారు. అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి ర్యాలీ ప్రారంభించారు. పీఎస్ఆర్ సెంటర్లో సభ నిర్వహించారు. మంత్రి వేదిక పైకి రాకముందు ఎస్పీ మంత్రి జగదీశ్‌రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. అందరూ బాహుబలి సినిమా చూశారా అంటూ జగదీశ్‌రెడ్డి బాహుబలి లాంటివారంటూ మోసేశారు. సినిమాలో బాహుబలి సింహాసనం వద్దకు వచ్చే సమయంలో వేదిక దద్దరిల్లుతుందని.. ఇప్పుడు మంత్రి రాకతో కూడా వేదిక దద్దరిల్లాలని' అన్నారు. వెనువెంటనే ఆయన నోటి వెంట 'జయహో మంత్రి జగదీశ్‌రెడ్డి' అనే మాటలొచ్చాయి. ఇంతటితో ఆగకుండా వేదికపై భారీగా స్లోగన్స్ ఇవ్వడంతో జిల్లాలో పెద్దచర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రజాప్రతినిధిని పొగడటం ఏంటని ప్రజలు విస్తుపోతున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన వారే ఇలా స్లోగన్స్ ఇవ్వడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్పీ ఇలా మాట్లాడటం వెనుక ఆంతర్యం ఏంటో అని జిల్లా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.