Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నో మతాలు ఉన్నా...ఒక మతం ప్రతిబింబమే నూతన విద్యావిధానం: ఏఐడీఎస్వో రాష్ట్ర తొలి మహాసభలో డాక్టర్ ఆమంచి నాగేశ్వరరావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రూపొందించిన నూతన విద్యావిధానం దేశ లౌకికతత్వానికి ప్రమాదం గా పరిణమిస్తున్నదని ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఆమంచి నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, జైన మతాలు ఉన్నప్పటికీ ఒక్క హిందు మతా నికి సంబంధించిన ప్రతిబింబమే అందులో కనిపిస్తు న్నదని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్లోని తెలు గు సారస్వత పరిషత్ ఆడిటోరియల్లో నిర్వహించిన ఏఐడీఎస్వో ప్రథమ మహాసభల సందర్భంగా నిర్వ హించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. విద్యావిధానం గురించి గొప్పగా చెబుతున్న కేంద్రం ఆ రంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం కపట త్వం చూపిస్తున్నదని విమర్శించారు. సగానికి సగం బడ్జెట్ తగ్గించడం వల్ల బడుగు, బలహీనవర్గాలకు సంబంధించిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. డిగ్రీస్థాయిలో మార్పులు చేయడం ద్వారా పేదల విద్యార్థులు విద్యకు దూర మవుతారని చెప్పారు. ఈ విధానం ద్వారా డిగ్రీ ఫెయిలైన పరీక్ష రాసే అవకాశం ఉండదన్నారు. దీంతో వారిని ఉపాధి, ఉద్యోగం దొరికే పరిస్థితులు ఉండబోవని చెప్పారు. ఉన్నత విద్యకు పేదలను దూరం చేసేందుకు కేంద్రం కుట్రపూరితంగా వ్యవ హరిస్తున్నదని చెప్పారు. యూనివర్సిల ఉనికి లేకుం డా చేసేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. కళాశాలలను స్వయంప్రతిపత్తి సంస్థలుగా మార్చడం ద్వారా ప్రయివేటీకరించేందుకు సులువైన మార్గాన్ని ఎంచుకున్నదని విమర్శించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కోర్సులు తయారు చేయకుండా వ్యాపార అవసరాల కోసమే వాటిని రూపొందిస్తా రని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటానికి మతం రంగు పులిమేందుకు ప్రయత్నిస్తూనే చరిత్ర ను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. కరోనా నివార ణకు ఆవుపేడ, ఆవు మూత్రం ఉపయోగించాలంటూ చెప్పారని విమర్శించారు. ఈ పరిస్థితులను తిప్పి కొట్టేందుకు విద్యార్థులు చదువుతూనే పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జినోమిక్స్ ప్రిన్సిపల్ సైటింస్టు డాక్టర్ సోమ ఎస్ మర్ల, సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్, ఏఐడీఎస్వో జాతీయ అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్, సౌరభ్ఘోష్, ఆర్ గంగాధర్ తదితరులు మాట్లాడారు.