Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ప్రాంతాన్ని ప్రతిబింబించేలా శనివారం తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన డిజైన్‌ను విడుదల చేయనున్నట్టు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవాలను పురస్కరించుకుని జాతీయ జెండా ఎగురవేస్తామన్నారు.
ఈ సందర్భంగా అందెశ్రీ రాసిన జయహే జయహే గీతాన్ని ఆలపిస్తామనీ, పార్టీ అధికారంలోకి రాగానే ఆ గీతాన్ని అధికారిక గీతంగా మారుస్తామని చెప్పారు.
అంబర్‌పేట్‌లో జోతిబాపూలే ఆడిటోరియం నిర్మించాలి : వీహెచ్
అన్ని కులాలకు ఆత్మగౌవర భవనాలను నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... అంబర్‌పేటలో జోతిబాపూలే ఆడిటోరియం పేరుతో నిర్మించాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు కోరారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాయనున్నట్టు తెలిపారు.