Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అది పాకిస్తాన్లో ఉందా? బంగ్లాదేశ్‌లో ఉందా?: బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్ కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా గాలి కొదిలేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరు కుమార్ విమ ర్శించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శుక్రవారం మారేడుపల్లిలోని డబుల్ బెడ్రూమ్ హౌజింగ్ కాలనీ వద్ద ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ''కంటోన్మెంట్ ప్రజలు ఏమైనా పాకి స్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళా? రోడ్లు, డ్రెయి నేజీ సమస్యలతోపాటు ఆఖరుకు తాగే నీళ్లు లేక అల్లాడుతుంటే ఎందుకు పట్టి ంచుకోవడం లేదు?'' అని ప్రశ్నిం చారు. కేంద్రం అనేక సంక్షేమ పథకా లను అమలు చేస్తున్నా కంటోన్మెంట్‌కు వర్తింపజేయడం లేదన్నారు. ఆ సంక్షేమ పథకాలను కంటోన్మెంట్ కు ఇవ్వకూడదని నీకేమైనా రాసిచ్చారా కేసీఆర్?అని నిలదీశారు. ఆర్మీ నుంచి కంటోన్మెంట్కి రావాల్సిన రూ.700 కోట్ల నిధులు తీసుకొచ్చే బాధ్యతను తాను తీసుకుంటాననీ, కంటోన్మెంట్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వు అని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. కంటోన్మె ంట్‌తో తనకేం సంబంధం అంటున్న కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు కేంద్రం 2.40 లక్షల ఇండ్లను మంజూరు చేసిందని తెలిపారు. వాటిని కట్టిస్తే మరో ఐదు లక్షల ఇండ్లవరకైనా కేంద్రం నుంచి మంజూరు చేయిస్తాన ని ప్రకటించారు. లిక్కర్‌స్కామ్‌లో బిడ్డ కవిత పేరు బయటపడటంతోనే కేసీఆర్ అంబేద్కర్ జపం చేస్తున్నారని విమర్శించారు. దమ్ముంటే అధికారం లో ఉన్నంతకాలం దళితున్ని సీఎం చేయాలని సవాల్ విసిరారు. శని వారం పరేడ్ గ్రౌండ్లో కేంద్ర బలగాల పరేడ్‌తో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నా మని తెలిపారు. దారుసలాం నిర్ణయా లకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన నడుస్తున్నదని విమర్శించారు.