Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు
- జనగామ, మిర్యాలగూడ బహిరంగసభలకు సీతారాం హాజరు
- హైదరాబాద్‌లో ముఖ్యఅతిధిగా విజయరాఘవన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వీరతెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు కార్యక్రమాలను శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నది. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు విజయరాఘవన్ రాష్ట్రానికి రానున్నారు. జనగామలో మధ్యాహ్నం 12 గంటలకు, మిర్యాలగూడలో సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించే బహిరంగసభలకు ముఖ్యఅతిధిగా ఏచూరి హాజరుకానున్నారు. సూర్యాపేట జిల్లా జాజ్జిరెడ్డిగూడెం (అర్వపల్లి) మండల సీపీఐ(ఎం) కార్యాలయం మల్లు స్వరాజ్యం భవనానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. వారోత్సవాల్లో భాగంగా శనివారం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని లోయర్‌ట్యాంక్‌బండ్‌లో ఉన్న వీరనారి ఐలమ్మ విగ్రహం నుంచి ట్యాంక్‌బండ్‌పైన ఉన్న మఖ్దూం మొహియుద్దీన్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతి ధిగా సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఎ విజయరాఘవన్ హాజరవుతారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ గార్డెన్స్‌తోపాటు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో జరిగే బహిరంగసభల్లో ముఖ్యఅతిధిగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొంటారు.