Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థుల కాస్మోటిక్, మెస్ చార్జీలు పెంచాలి
- ప్రభుత్వ విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి
- బడ్జెట్లో విద్యారంగానికి 33శాతం నిధులు కేటాయించాలి
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆర్ఎల్.మూర్తి, నాగరాజు
- 79మందితో ఎస్ఎఫ్ఐ నూతన కమిటీ ఎన్నిక
నవతెలంగాణ - కరీంనగర్
విద్యారంగంలో ప్రమాదకర మతోన్మాద భావజాలాన్ని ప్రతిఘటించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు ఆర్ఎల్.మూర్తి, నాగరాజు పిలుపునిచ్చారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర మహాసభ విజయవంతంగా ముగించుకున్న సందర్భంగా శనివారం కరీంనగర్ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం నిర్వహించారు. మహాసభలో ఎన్నికైన రాష్ట్ర నూతన కమిటీని ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్.మూర్తి, నాగరాజు మాట్లాడుతూ.. కరీంనగర్ పట్టణంలో ఎస్ఎఫ్ఐ 4వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేసిన అందరికీ విప్లవాభినందనలు తెలి పారు. విద్యార్థుల భవిష్యత్ పోరాటాల రూపకల్పనకు 20తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమెదించుకున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానా లపై పోరాటాలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న 24వేల టీచర్ పోస్టులు, 12వేల లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాల న్నారు. యూనివర్సీటీలో ఉన్న ప్రోఫెసర్, అసిస్టెంట్ ప్రోపెసర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. మహాసభ చివరి రోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శివర్గం 19మందితో, రాష్ట్ర కార్యవర్గం 79మందితో నూతనంగా ఎన్నికైనట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శు లుగా ఆర్ఎల్ మూర్తి, టి.నాగరాజు తిరిగి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షు లు శనిగరపు రజినీకాంత్, మక్కపల్లి పూజ, రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీకాంత్, మనిషా, శ్రీజ, మానస, మనోజ్ పాల్గొన్నారు.
మహాసభ ఆమోదించిన తీర్మానాలు..
- సూతన జాతీయ విద్యావిధానం-2020 రద్దు చేయాలి
- ఫీజుల నియంత్రణ చట్టం చేయాలి.
- ప్రయివేటు యూనివర్సిటీట చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయాలి.
- విద్యార్థినులపై దాడులు, లైంగిక దాడులను అరికట్టాలి. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి.
- రాష్ట్రంలో జాతీయ విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలి.
- జిల్లాకో ఇంజినీరింగ్ కళాశాల, నియోజకవర్గానికో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలి.
- రాష్ట్రంలో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలి.
- సంక్షేమ హాస్టళ్ల వసతి గృహాలు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి.
- విద్యార్థుల మెస్, కాస్మోటిక్స్ చార్జీలు పెంచాలి. నాణ్యమైన భోజనం అందించాలి.
- మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచాలి.
- మైనారిటీ హాస్టల్స్ బలోపేతం చేయాలి.
- ఏజెన్సీలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి.
- సాంకేతిక విద్యకు నిధులు పెంచాలి. ప్రొఫెషనల్ విద్యాసంస్థల్లో అక్రమ ఫీజులు అరికట్టాలి.
- విద్యారంగంలో మత విద్వేషాలు వ్యతిరేకించాలి. ప్రతి పీహెచ్డీ విద్యార్థికీ ఫెలోషిప్ ఇవ్వాలి, రాష్ట్ర యూనివర్సిటీలలో ప్రతి ఏటా పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల చేయాలి.
- విద్యాసంస్థల్లో విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్స్ ఉచితంగా ఇవ్వాలి. విద్యా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి. కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలి. ప్రభుత్వ విద్యను పటిష్టం చేయాలి, బడ్జెట్లో నిధులు పెంచాలి. ప్రభుత్వ యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడాలి.
నూతన కమిటీ
రాష్ట్ర అధ్యక్షులుగా ఆర్ఎల్. మూర్తి, రాష్ట్ర కార్యదర్శిగా టి. నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గా టి.రవి, ఎం.పూజ, ఎస్. రజనీ కాంత్, డి.శ్రీశాంత్ వర్మ, బి.శంకర్, బషీర్, సంతోష్ సాయి కృష్ణ, ప్రశాంత్, బి.ప్రశాంత్ ఎన్నికయ్యారు. రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా శంకర్, వి.రాజు, మిశ్రీని సుల్తానా, బి.అనిల్, కే.అశోక్ రెడ్డి, బి.వీరభద్రం, కిరణ్‌ను ఎన్నుకున్నారు.