Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించడం హర్షణీయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. దళిత బంధులాగే త్వరలోనే గిరిజన బంధు కార్యక్రమాన్ని అమలు చేసి ప్రతి గిరిజన కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేయాలని తీసుకున్న నిర్ణయం చారిత్రా త్మకమని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్థికంగా, సామాజి కంగా వెనుకబడిన గిరిజనులను అన్ని రంగాల్లో అగ్రపథాన నిలపడా నికి ముఖ్యమంత్రి ప్రయత్నించడం గొప్ప విషయమని తెలిపారు.