Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోయిన్పల్లి వినోద్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అప్పటి హోం మంత్రి వల్లభాయ్ పటేల్‌ది జాతీయ సమైక్యతా వాదమనీ, ప్రస్తుత హోంమంత్రి అమిత్‌షాది విచ్ఛిన్నకర నాదమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. మత విద్వేష బీజాలను నాటడం బీజేపీ నాయకులు మానుకోవాలని శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వారి తీరు దేశ సమగ్రతకు చేటు అని తెలిపారు. ప్రతి ఒక్కరికీ విశాల దృక్పథం అవసరమని పేర్కొన్నారు. సంకుచిత భావంతో ఏమీ సాధించలేరని స్పష్టం చేశారు. ఈ వాస్తవాన్ని గ్రహించి మెలగాలని సూచించారు. భారత రాజ్యాంగం మేరకు మత విశ్వాసం కలిగి ఉండటం ప్రజల ప్రాథమిక హక్కనీ, అయితే మత ఛాందసవాదం మాత్రం దేశానికి పెను ప్రమాదమని విమర్శించారు.