Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభారు పటేల్ చిత్ర పటానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌చుగ్, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. బండి సంజయ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పటేల్ సాహసోపేత నిర్ణయం వల్ల హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసిందని తెలిపారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య వంటి ఎందరో మహామహులు నిజాం కు వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు. దారుస్సలాం నుంచి అనుమతి లభించాకే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిందని విమర్శించారు. మల్కాజిగిరి హాస్టల్లో పిల్లలకు పాచిపోయిన అన్నం పెడుతున్నారని వాపోయారు.
అసెంబ్లీ వద్ద పటేల్ విగ్రహానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళి
తెలంగాణలో రజాకార్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసింది పటేల్ నేతృత్వంలోని భారత సైన్యమేనని మాజీ ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు అన్నారు. అసెంబ్లీ వద్ద ఉన్న సర్దార్ వల్లాభారు పటేల్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్లో కలపాలని చూసిన నిజాం ఎత్తుగడను పటేల్ చిత్తుచేశారన్నారు. సర్ధార్ అఖండ దేశ భక్తుడనీ, దేశ సమైఖ్యతకు బలమైన నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. కుల,మతాలకతీతంగా దేశం సమైక్యతతో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.