Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ గిరిజన సంఘం హర్షం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన సంఘాల పోరాట ఫలితమే రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ సీఎం కేసీఆర్ ప్రకటించారనీ, ఈ ప్రకటన పట్ల తెలంగాణ గిరిజన సంఘం(టీజీఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్, ఆర్ శ్రీరాం నాయక్ శనివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో జీవో విడుదల చేస్తున్నట్టు చెప్పటం అభినందనీయమని తెలిపారు. ఈ అంశంపై సీఎం కు పలు సందర్భాల్లో లేఖలు రాశామనీ, ఇటీవలే సం బంధిత మంత్రిని కలిసి చర్చించామని పేర్కొ న్నారు. ఎనిమిదేండ్లుగా గిరిజన సంఘాలు నిర్వహించిన ఐక్యపోరాటాల ఫలితమే ఈ రిజర్వేషన్లని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినందున్నే రాష్ట్ర ప్రభుత్వం చొరవ ప్రదర్శించిందని పేర్కొన్నారు. వారం రోజుల్లో జీవో విడుదల చేసి, ప్రస్తుతం జరుగుతున్న ఉద్యోగ నియామకాల్లో 10శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు..
గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని కేంద్రం తిరస్కరించిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రాల వారిగా శాస్త్రీయ గణాంకాలను పరిగణనలోకి తీసుకుని ఆయా సామాజిక తరగతుల హక్కులకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదేనని తెలిపారు.