Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ గిరిజన సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజనులకు 10శాతం జీవోకు కేంద్రం చట్టబద్దత కల్పించాలని తెలంగాణ గిరిజన సంఘం(టీజీఎస్) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం .ధర్మ నాయక్, ఆర్. శ్రీరాంనాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పెంచుతూ వారం రోజుల్లో జీవో ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు.గత ఎనిమిదేండ్లుగా గిరిజనులు సాగిస్తున్న పోరాటాల పలితంగానే ఈ ప్రకటన వెలువడిందని తెలిపారు.వారికి కల్పించిన రాజ్యాంగ హక్కులను ఉపయోగించి జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తే దాని రక్షణకు కేంద్రం భాధ్యత తీసుకుంటుందని మంత్రి కిషన్ రెడ్డి అనేక సార్లు వాగ్దానం చేశారని గుర్తు చేశారు. దీనికి చట్టబద్ధత కల్పిస్తూ ఆర్టికల్ 9 వ షెడ్యూల్లో చేరుస్తూ పార్లమెంటులో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాల్లో ఈ జీవో వర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని కోరారు. అవసరమైతే సూపర్ న్యూమరెరీ పోస్టులు క్రియేట్ చేయాలని డిమాండ్ చేశారు. ే దేశంలోని గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం 11 శాతానికి రిజరేషన్లు పెంచుతూ పార్లమెంటులో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో గిరిజన రిజర్వేషన్ పెంచకుండానే 705 తెగలకు అదనంగా మరో 15 కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం విచారకరమన్నారు. అడగకుండానే అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించిన కేంద్ర ప్రభుత్వం, దళిత, గిరిజనులకు ఎందుకు విస్మరిస్తున్నదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన బంధు'' పథకాన్ని గిరిజనులందరికీ వర్తింపచేయాలన్నారు.