Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ అధ్యక్షులు రేవంత్
నవతెలంగాణబ్యూరో
గత ప్రభుత్వాల్లో సర్పంచులు, ఎంపీటీసీలకు ఎంతో గౌరవం ఉండేదని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితులులేవని చెప్పారు. ఆదివారం హైదరాబాద్లోని తన నివాసంలో రేవంత్ సమక్షంలో పలు పార్టీలకు చెందిన స్థానిక కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ టీఆర్ఎస్, బీజేపీ అధికారంలోకి వచ్చాక స్థానిక నాయకులంటే పైరవీకారులన్న ముద్ర పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల కోసం రోజుకో పంచాయితీ తీసుకొస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పేదలు బతకలేని దుస్థితి ఏర్పడిందన్నారు. మునుగోడులో కాంగ్రెస్ గెలుపు కోసం యువత కృషి చేయాలని కోరారు.