Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రష్యాలోని ఎత్తయిన శిఖరం ''ఎల్బ్రస్'' పర్వతాన్ని అధిరోహించిన తెలంగాణకు చెందిన 18 ఏండ్ల యువ పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్ నాయక్‌ను హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అభినందించారు. ఆదివారం బండారు బాలునికి ఫోన్ చేసి మాట్లాడారు. ''ఎల్బ్రస్'' పర్వతాన్ని అధిరోహించి జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. యశ్వంత్ నాయక్‌ను తెలంగాణతో పాటు యావత్ జాతి గర్వించేలా చేశారన్నారు. ఎవరెస్ట్ శిఖరంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరెన్నో శిఖరాలను అధిరోహించాలని ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలిపారు. భూక్య యశ్వంత్ నాయక్ (18) శుక్రవారం ఉదయం 8:51 గంటలకు రష్యాలోని ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించాడు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన అతను ఈ నెల 11న పర్వతారోహణ ప్రారంభించి 16న శిఖరాన్ని అధిరోహించాడు. అతను ఆరు రోజుల్లో మైనస్ 22 డిగ్రీల సెల్సియస్‌లో 5,642 మీటర్ల ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించాడు.