Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ నేతలు చాడ, కూనంనేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన ఎస్టీ రిజర్వేషన్లను పది శాతానికి పెంచనున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడవెంకటరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. ఆదివాసీ, గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన న్యాయబద్ధ వాటాను అందించడంలో పెద్ద ముందడుగని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం బేఖాతరు చేసినప్పటికీ , రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్లలో కూడా రిజర్వేషన్ పెంపు నిర్ణయం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోడు సాగుదారుల సమస్యను కూడా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా సమన్వయ కమిటీలు నిర్ణీత సమయంలోగా పోడు సాగు దరఖాస్తులను పరిష్కరించి హక్కు పత్రాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. 75 ఏండ్లుగా సాగులో ఉన్న గిరిజనేతరులకు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు.