Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేవెళ్ల ఎంపీ రంజిత్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు
నవతెలంగాణ రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు లక్షల మందికి ఇంటింటికీ వైద్యం అందించాలన్న లక్ష్యంతో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి తమ పుట్టిన రోజు సందర్భంగా 'ఆరోగ్య చేవెళ్ల' కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మొబైల్ మెడికల్ క్లినిక్ బస్సును మంత్రి కేటీఆర్ ఆదివారం ప్రారంభించారు. అంతకు ముందు ఎంపీ రంజిత్‌రెడ్డి తమ పుట్టిన రోజు సందర్భంగా ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ కలిసి ఆశ్వీరాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఆరోగ్యంపై అవగాహన పెంచడమే 'ఆరోగ్య చేవెళ్ల' కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. హైపర్‌టెన్షన్, డయాబెటిస్, సర్వైకల్ క్యాన్సర్లు, సాధారణ ఆరోగ్య పరీక్షలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మొబైల్ క్లినిక్ అవసరమైన భద్రతను దృష్టిలో ఉంచుకుని తయారు చేశామన్నారు. సులభమైన స్క్రీనింగ్, ప్రాథమిక చికిత్స అందుబాటులో ఉంటుందన్నారు.