Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోల్ బాటిళ్లతో గ్రామస్తుల ధర్నా
నవతెలంగాణ-కొండపాక
నిర్మించిన అన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఒకేసారి పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కొండపాక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఖమ్మంపల్లి గ్రామస్తులు సోమవారం పెట్రోల్ బాటిళ్లతో ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో 41 మంది అర్హులను ఎంపిక చేశారని, మిగతా 19 మంది పేర్లను పెండింగ్ పెట్టారని తెలిపారు. అధికారులు ఎంపిక చేసిన జాబితాలో 15 మంది అనర్హులు ఉన్నారని తెలిపారు. ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేసి అర్హులయిన లబ్దిదారులను ఎంపిక చేసి అన్ని ఇండ్లను కేటాయించాలని కోరారు.