Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారతీయ విద్యార్థులు చేరండి
- కిరిగిజ్ రాష్ట్ర మెడికల్ అకాడమి డీన్ జుమాబే కోవిచ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వైద్య విద్యాస్వప్నాన్ని సాకారం చేసుకోండి, అతితక్కువ ఖర్చుతో కిరిగిస్తాన్ చారిత్రక వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ కోర్సును చదవాలని కిర్గిజ్ రాష్ట్ర మెడికల్ అకాడమి అకడమిక్స్ డీన్, తగవే తగోల్ బారు జుమాబే కోవిచ్ అన్నారు. సోమవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ విద్యార్థులు తమ దేశంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చేరాలని కోరారు. అత్యున్నత ప్రమాణాలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో వైద్యవిద్యను అందిస్తున్నామని చెప్పారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అబ్బాయిలు, అమ్మాయిలకు వేర్వేరుగా హాస్టల్ సౌకర్యం, పటిష్ట భద్రతతో కూడిన విద్యనందిస్తున్నామన్నారు. నీట్లో అర్హత సాధించిన వారే తమ కోర్సులో ప్రవేశం పొందడానికి అర్హులని స్పష్టం చేశారు. ఆరేండ్ల ఎంబీబీఎస్ కోర్సుకు 29,000 యూఎస్ డాలర్లు (రూ.22.04 లక్షలు) ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. హాస్టల్ ఫీజు మొదటి ఏడాది 2300 యూఎస్ డాలర్లు (రూ.1.74 లక్షలు) అదనంగా చెల్లించాలని కోరారు. భారత్లో నీట్ రాసినా ఎంబీబీఎస్, బీడీఎస్ సీటు రాని విద్యార్థులు నిరాశపడొద్దని సూచించారు. తక్కువ ఖర్చుతో కిరిగిస్తాన్ లో ఆ కోర్సులో చేరి డాక్టర్ కావాలన్న కలను నిజం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎస్ఎం ఎడ్యుటెక్ సీఈవో శ్రీనేశ్, ఈవింగ్స్ సీఈవో ఎ రామకృష్ణ, ప్రోసియం సీఈవో డాక్టర్ భానుప్రకాశ్ పాల్గొన్నారు.