Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరింత విస్తరించిన ఒలెక్ట్రా బస్సులు
- బస్సులను 15 ఏండ్లు మెయింటెయిన్ చేయనున్న కంపెనీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమి టెడ్ నుంచి ఈవీ ట్రాన్స్ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చాయి. ఒలెక్ట్రా బస్సులు కొత్తగా మరో నగరానికి విస్తరించ నున్నాయి. థానే మున్సిపల్ ట్రాన్స్పోర్ట్ అండర్‌టేకింగ్ నుంచి 123 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్‌కు సంబంధించి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్, ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్టియం లెటర్ ఆఫ్ ఆర్డర్‌ను అందుకుంది. ఈ బస్సులను 15 సంవత్సరాల కాలానికి గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ మోడల్ ఆధారంగా కంపెనీ సరఫరా చేయనుంది. ఆర్డర్ విలువ రూ.185 కోట్లు. వచ్చే 9 నెలల్లో బస్సులను డెలివరీ చేయనున్నది. లిథియం-అయాన్ బ్యాటరీ కలిగి ఉన్న ఈ బస్సులను నాలుగు గంటల్లోగా పూర్తిగా చార్జి అవుతుంది. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ కాంట్రాక్ట్ కాలం, అంటే 15 ఏండ్ల పాటు మెయింటెనెన్స్ చేయనుంది. ఈ సందర్భంగా, ఒలెక్ట్రా గ్రీన్ టెక్ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.వి ప్రదీప్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర నుంచి మరొక ఆర్డర్‌ను పొందడం సంతోషంగా ఉందని, తమ కంపెనీ పేరు ప్రతిష్టలు థానేకి విస్తరించాయని చెప్పారు. ఇప్పటికే ముంబయి, పూణే, నాగ్‌పూర్ నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నామని తెలిపారు. ఒక్క మహారాష్ట్రలోనే ఒలెక్ట్రా ఈ-బస్సులు మూడు కోట్ల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి పొల్యూషన్‌ను గణనీయంగా తగ్గించా యని చెప్పారు. ఈ-బస్సులు భారతదేశంలోని నలుమూలలా వెళ్తూ దాదాపు ఏడు కోట్ల కిలోమీటర్లకు పైగా ప్రయాణించాయని తెలిపారు.