Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
- మంత్రి కేటీఆర్కు సీఐటీయూ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమ్మెలో జోక్యం చేసుకోవాలనీ, సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వారు మంత్రి కె.తారకరామారావుకు లేఖ రాశారు. రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో సుమారు 25వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారనీ, సంస్థకు లాభాలు తెచ్చిపెట్టడంలో వారి పాత్ర కీలకమని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాల పెంపు, కోలిండియా ఒప్పందాలు, కార్మిక చట్టాలు, చట్టబద్ధ సౌకర్యాల కల్పనలో సింగరేణి యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కోలిండియాలో కాంట్రాక్టు కార్మికునికి రోజుకు రూ.985 చెల్లిస్తుంటే సింగరేణిలో మాత్రం రూ.466 మాత్రమే చెల్లిస్తున్నారనీ, దీనివల్ల కాంట్రాక్టు కార్మికుడు సుమారు రూ.14 వేలు నష్టపోతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.