Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సబ్ ప్లాన్ నిధులు మళ్లించిన విలన్ కేసీఆర్ : బక్క జడ్సన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఎం కేసీఆర్‌ను అభినవ అంబేద్కర్ అంటూ సంగారెడ్డి కలెక్టర్ శరత్ పొగడటాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఈ మేరకు సోమవారం ఏఐసీసీ సభ్యులు బక్క జడ్సన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎనిమిది బడ్జెట్లోల ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులకు మళ్లించిన ముఖ్యమంత్రి కేసీఆర్ విలన్ అని విమర్శిచారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, వర్థంతి వేడుకలకు ఇప్పటి వరకు రాని సీఎం, ఆయన మంత్రులు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని తెలిపారు. జనాన్ని మభ్యపెట్టేందుకు ఐఏఎస్, ఐపీఎస్‌లను ప్రచారానికి వాడుకుంటున్నారని పేర్కొన్నారు. శరత్ వ్యాఖ్యలను టీపీసీెసీ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు పటేల్ రమేష్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనా రెడ్డి, రాష్ట్ర ఇన్ ఛార్జి క్రిష్ణ అలవేరు ఖండించారు.