Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కంచర్ల, డీఎంఈను నిలదీసిన రోగులు, బంధువులు
- సూపరింటెండెంట్‌పై ఎమ్మెల్యే ఫైర్
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కట్టంగూర్ మండలం చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన బాలింత అఖిల మృతిపై సోమవారం డీఎంఈ రమేశ్‌రెడ్డి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని వార్డులను పరిశీలించారు. వార్డులు శుభ్రంగా లేకపోవడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంఈ రాకను తెలుసుకున్న నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయనతో కలిసి వార్డులను తనిఖీ చేస్తుండగా.. రోగులు, వారి బంధువులు నిలదీశారు. 'ఆస్పత్రిలో కనీస వసతులు లేవు. మీ కుటుంబంలో ఎవరికైనా జబ్బు చేస్తే ఇలాంటి హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటారా' అని ప్రశ్నించారు. దాంతో వసతుల నిర్వహణపై ఆస్పత్రి సూపరింటెండెంట్ లచ్చీరామ్నాయక్పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవలందించడం చేతకాకపోతే రాజీనామా చేసి వెళ్లిపోండి అన్నారు.