Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరీంనగర్‌కు చెందిన బిల్డర్ నివాసంలోనూ సోదాలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సోమవారం మరోసారి హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మె ంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. గత పది రోజుల్లో ఈడీ హైదరాబాద్‌లో దాడులు చేయటం ఇది రెండోసారి. హైదరాబాద్‌లోని రామంతాపూర్,మాదాపూర్, బంజారాహిల్స్,రాయదుర్గంతో పాటు కరీంనగర్లో సైతం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. రామాంతపూర్, మాదాపూర్‌లలో మూడు సాఫ్ట్వేర్ కంపెనీలలో కూడా ఈడీ అధికారుల సోదాలు సాగాయి.కాగా, కరీంనగర్‌కు చెందిన బిల్డర్ శ్రీనివాస్ ఇంట్లోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అంతేగాక, తదుపరి విచారణ కోసం శ్రీనివాస్‌ను హైదరాబాద్‌లోని తమ కార్యాలయానికి తరలించి సాయంత్రం వరకు విచారించారు. కాగా, ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసిన హైదరాబాద్ మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్రన్ పిళ్లైతో బిల్డర్ శ్రీనివాస్‌కు సంబంధా లున్నాయని ఈడీ దర్యాప్తు సాగిస్తున్నట్టు తెలిసింది. అలాగే, తాము సోదాలు నిర్వహించి సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి కొన్ని కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.