Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎంసీపీఐ(యూ) జాతీయ కమిటీ సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో ఉన్న ఓంకార్ భవన్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 12 నుంచి 15 వరకు బీహార్‌లోని ముజాఫర్పూర్లో జరిగే అఖిల భారత మహాసభలు, దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.