Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ)లో సమ్మెలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలలపాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు ఈనెల 25 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.
21న ఎస్సీ సంక్షేమ కమిటీ మీటింగ్
తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటేరియట్ కమిటీ సమావేశం ఈనెల 21న అసెంబ్లీ హాల్లో జరుగుతుందని శాసనసభ కార్యదర్శి డాక్టర్ వీ నర్సింహాచార్యులు తెలిపారు. పురపాలకశాఖలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు, షెడ్యూల్డ్ కులాల సంక్షేమంపై ఈ కమిటీ సమీక్షిస్తుందని సోమవారంనాడొక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.