Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ)లో పీఈసెట్ పరీక్షను బుధవారం నిర్వహించనున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ వి సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటగా ధ్రువపత్రాల పరిశీలనతో ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 100 మీటర్ల పరుగు, షార్ట్ పుట్, లాంగ్ జంప్ మూడు అంశాల్లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని వివరించారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఆరు కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నట్టు తెలిపారు. మహిళలు, పురుషులకు విడివిడిగా ప్రత్యేకమైన సెంటర్లను కేటాయించామని స్పష్టం చేశారు. బీపీఈడీ, డీపీఈడీకి అబ్బాయిలు 2,205 మంది, అమ్మాయిలు 1,427 మంది కలిపి 3,632 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని వివరించారు. వారిలో ఇప్పటి వరకు మొత్తం మూడు వేల మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు.