Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రికి సొంత పార్టీ శ్రేణుల అడ్డగింత
నవతెలంగాణ-ములుగు
దళితబంధు పథకాన్ని తమకు వర్తింపజేయాలని కోరుతూ సొంత (టీఆర్ఎస్) పార్టీకి చెందిన శ్రేణులు రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ను అడ్డుకున్నారు. ములుగు జిల్లాలో అధికారిక సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆమెను జాకారం గట్టమ్మ వద్ద ఆత్మ చైర్మెన్ దుర్గం రమణయ్య నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు అడ్డుకుని నిలదీశారు. దళిత సామాజిక తరగతికి చెందిన కార్యకర్తలకు న్యాయం చేయని మంత్రులు జిల్లాలో అడుగు పెట్టొద్దంటూ నినాదాలు చేశారు. మంత్రి సత్యవతి, జెడ్పీ చైర్మెన్ జగదీష్ కాళ్లు పట్టుకుని దళితబంధు ఇప్పించాలని వేడుకున్నారు. ఆందోళనలో టీఆర్ఎస్ పార్టీ అనుబంధ ఎస్సీ సెల్ నాయకులు రామిల్ల రాజేందర్, నెమలి బాలకృష్ణ, బొడ రాములు, దాసరి రమేష్, కోయిల మహేష్, తదితరులు పాల్గొన్నారు.