Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'డబుల్' ఇండ్ల సమస్యలు పరిష్కరించాలంటూ.. కలెక్టరేట్ ఎదుట సీపీఐ(ఎం) ధర్నా
నవతెలంగాణ - జనగామ
తమ సమస్యలను చెప్పుకునేందుకు కలెక్టరేట్‌కు వచ్చిన మైనార్టీ మహిళల సమస్యలు పరిష్కరించకపోగా ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి వచ్చారా అంటూ కలెక్టర్ అవమానించిన కలెక్టర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం జనగామ పట్టణంలోని 3వ విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి కేటాయించాలని కోరుతూ బాణపురం నుంచి కలెక్టరేట్ వరకు మైనార్టీ మహిళలు పాదయాత్రగా వచ్చి ధర్నా నిర్వహించారు. అనంతరం వినతిపత్రం ఇవ్వడానికి కలెక్టర్‌ను కలిసేందుకు ఆయన ఛాంబర్‌కు వెళ్లగా.. ఫొటోలకు ఫోజులివ్వడానికి వచ్చావా అంటూ వారిని అవమానపరిచేలా మాట్లాడారని ఆరోపించారు. ఈ విషయమై సీపీఐ(ఎం) కార్యకర్తలు, మూడో విడత లబ్దిదారులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివలింగయ్య కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కుర్చీకే పరిమితమయ్యారని, జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చెప్పుచేతుల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్‌కు సమస్యలు చెప్పుకుందామని వచ్చిన ప్రజల పట్ల ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తూ అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జనగామ పట్టణంలో మూడో విడత ఇందిరమ్మ లబ్దిదారులైన 1147 మందికి ఇండ్ల స్థలాల పట్టాలిచ్చి స్థలాలు చూపెట్టలేదని తెలిపారు. వారంతా ప్రభుత్వ స్థలంలో ఇండ్లు నిర్మించుకుని నివాసం ఉంటుండగా అప్పటి ఆర్డీవో వారివద్దకు వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చి నిర్మించుకున్న ఇండ్లను తొలగించారన్నారు. అప్పటి నుంచి వేల రూపాయల అద్దె చెల్లిస్తూ కరోనా కష్టకాలంలో అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. కాగా, ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా నాసిరకంగా ఉండటంతో పలుమార్లు కలెక్టర్‌కు తమ సమస్యలను విన్నవించామని తెలిపారు.
బ్దిదారులు, తమ పార్టీ కార్యకర్తలను అవమానించేలా కలెక్టర్ ప్రవర్తించారని ఆరోపిం చారు. అనంతరం పోలీసులు పార్టీ నాయ కులు, లబ్ది దారులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి, బొట్ల శేఖర్, ఇర్రి అహల్యా, సింగారం రమేష్, టౌన్ కార్యదర్శి జోగు ప్రకాశ్, జిల్లా కమిటీ సభ్యులు అజారుద్దీన్, విజేందర్, భూక్య చందు, పొత్నూరి ఉపేందర్, లబ్దిదారుల సంఘం అధ్యక్షులు కళ్యాణం లింగం, కార్యదర్శి ఎండీ గౌసియా, పట్టణ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.