Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 36,437 మంది అమ్మాయిల అర్హత
- 17,613 మందే అబ్బాయిలు ఉత్తీర్ణత
- ఫలితాలు విడుదల చేసిన లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్)-2022 ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, ఓయూ వీసీ డి రవీందర్ మంగళవారం హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎనిమిది విశ్వవిద్యాలయాల్లో 50 సబ్జెక్టుల్లో ప్రవేశాలకు గతనెల 11 నుంచి 23 వరకు రాతపరీక్షలు జరిగాయని చెప్పారు. సీపీగెట్కు 67,027 మంది దరఖాస్తు చేశారనీ, వారిలో 57,262 మంది పరీక్షలు రాశారని వివరించారు. రాసిన వారిలో 54,050 (94.39 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని అన్నారు. ఇందులో 22,159 మంది అబ్బాయిలు దరఖాస్తు చేస్తే, 18,550 మంది పరీక్ష రాశారని చెప్పారు. వారిలో 17,613 (94.95 శాతం) మంది అర్హత సాధించారని వివరించారు. 44,868 మంది అమ్మాయిలు దరఖాస్తు చేయగా, 38,712 మంది పరీక్షలకు హాజరయ్యారని అన్నారు. వారిలో 36,437 (94.12 శాతం) మంది ఉత్తీర్ణత పొందారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే అమ్మాయిలు ఎక్కువగా ఉన్నత విద్యను అభ్యసించేందుకు వస్తు న్నారని అన్నారు. ఎనిమిది విశ్వవిశ్వవిద్యాల యాల పరిధిలో 45,003 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అమ్మాయిలు 67 శాతం ప్రవేశాలు పొందుతారనీ, అబ్బాయిలు 33 శాతం ఉంటారని అన్నారు. గతేడాది కంటే సీజీగెట్ దరఖాస్తులు 11,065 వరకు తగ్గాయని వివరించారు.
ఆన్లైన్లోనే పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ : పాండురంగారెడ్డి
ఆన్లైన్లో పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహిస్తా మని సీపీగెట్ కన్వీనర్ ఐ పాండురంగారెడ్డి చెప్పారు. సీపీగెట్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటినుంచే కౌన్సెలింగ్లో పాల్గొని సీట్లు పొందొచ్చని సూచిం చారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తిగా ఆన్లైన్లో ఉంటుందని స్పష్టం చేశారు. అయితే విద్యార్థులం దరూ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతోపాటు విద్యార్హతకు సంబంధించినవి సిద్ధం చేసుకోవాలని కోరారు. ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను మీ సేవతో అనుసంధానం చేసుకుంటామని చెప్పారు. ఆ పత్రాలు సరైనవా? కాదా? అన్నది విద్యార్థులు నమో దు చేసే వాటి నెంబర్లను బట్టి తెలిసిపోతుందన్నా రు. సీటు పొందిన తర్వాత నేరుగా కాలేజీకి వచ్చి చేరితే సరిపోతుందని అన్నారు. కార్యక్రమంలో టీయూ వీసీ రవీందర్గుప్తా, ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మి నారాయణ, అడ్మిషన్ల జాయింట్ డైరెక్టర్లు గంగాధర్, అక్తర్, చలపతి తదితరులు పాల్గొన్నారు.