Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయప్రతినిధి
ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా కర్నాటక రాష్ట్రానికి గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాలో ఆరుగురు నిందితులను వరంగల్ టాస్క్‌ఫోర్స్, ఖానాపూర్ పోలీసులు అరెస్ట్ చేసారు. వారి నుంచి సుమారు రూ.కోటీ 10లక్షల విలువైన 550 కిలోల గంజాయితోపాటు ఒక వ్యాన్, కారు, ద్విచక్రవాహనం, ఐదు సెల్ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధిత వివరాలను వరంగల్ పోలిస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి విలేకరులకు వెల్లడించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం మంగళవారిపేట గ్రామానికి చెందిన బానోత్ చందు, బూర్గంపహాడ్‌కు చెందిన కన్న బోయిన దుర్గాప్రసాద్, వరంగల్ జిల్లా రాయపర్తి మండలం గుబ్బాడి తండాకు చెందిన గులోత్ అనిల్, గుబ్బాడి తండాకు చెందిన బానోత్ మహేందర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్‌కు చెందిన పిల్లలమర్రి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారెడిమిల్లి గ్రామానికి చెందిన కత్తా చిన్నారెడ్డి ఉన్నారు. రాయపర్తికి చెందిన నరసింహరావు ఆలియాస్ రాజు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. వరంగల్ జిల్లా రాయపర్తికి చెందిన ప్రధాన నిందితుడు నరసింహారావు, కన్నబోయిన దుర్గాప్రసాద్‌తో కలిసి నాలుగేండ్లుగా ఒడిశాలోని బలిమెల నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి కర్నాటకలో ఎక్కువ ధరకు విక్రయించేవాడు. దీని సరఫరాకు నరసింహారావు తన సొంత వ్యాన్, కారులో రవాణా చేసేవారు. ఈ క్రమంలో మిగితా నిందితులతో కలిసి ఓడిశాలో 550 కిలోల గంజాయిని కొనుగోలు చేసి వాటిని రెండు కిలోల చొప్పున ప్యాకింగ్ చేసి 275 ప్యాకెట్లను ఐచర్ వ్యాన్‌లో రహస్యంగా భద్రపర్చారు. విక్రయించేందుకు నిందితులు 19వ తేదీన బలిమెల నుంచి చింతూరు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబా బాద్, హైదరాబాద్ మీదుగా కర్నాటకలో విక్ర యించేందుకు బయలుదేరారు.
గంజాయిని తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో మంగళవారం మధ్యాహ్నం టాస్క్‌ఫోర్స్, ఖానాపూర్ పోలీసులు సంయుక్తంగా బుధరావుపేట గ్రామ శివారులో తనిఖీలు నిర్వహించారు. అనుమానంతో పోలీసులు ఐచర్ వ్యాన్, ద్విచక్రవాహనం, కారులో వస్తున్న నిందితులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది.