Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెండోరా
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 19న కామారెడ్డి జిల్లా గండిమాసాని పేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జరిగిన అండర్-14 బాల బాలికల ఖోఖో పోటీల్లో పోచంపాడ్ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచినట్టు ప్రిన్సిపాల్ తారాసింగ్ తెలిపారు. సీహెచ్.రాజు, ఎ.సుశాంత్, పి.మనోహర్, డి.సంజయ్రాజ్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్టు వెల్లడించారు. రాష్ట్ర పోటీలకు ఎంపికకావడంతో డిప్యూటీ వార్డెన్ మంజుల, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.