Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్దపల్లి జిల్లాలో ఘటన
నవతెలంగాణ - పెద్దపల్లి
రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు రైలు ఢకొీనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. వీరిలో ఒకరు రైల్వే పర్మినెంట్ ఉద్యోగి కాగా, మరో ఇద్దరు రోజు వారీ కూలీలుగా తెలిసింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో మంగళవారం జరిగింది. పెద్దపల్లి మండలం చీకురాయి వద్ద హుస్సేన్‌మియా వాగు సమీపంలో కార్మికులు రైల్వే ట్రాక్‌పై మరమ్మతు పనులు చేస్తున్నారు. ఈ సమయంలో ఢిల్లీ నుంచి బెంగళూర్ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ వారిని ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో రైల్వే ఉద్యోగి దుర్గయ్య, రోజువారి కూలీలు శ్రీనివాస్, వేణు మృతిచెందినట్టు రైల్వే అధికారులు తెలిపారు.