Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నల్లగొండ జిల్లా, దేవరకొండలో ఇద్దరు మహిళలకు శిరోముండనం చేయడం అత్యంత దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబ శివరావు తెలిపారు. ఇది హేయమైన సంఘటన అనీ, సభ్య సమాజానికి అవ మానకరమని మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. మహిళలకు శిరోముండనం చేసిన వారికీ అదే తరహాలో శిరోముండనం చేయాలని ఆయ న డిమాండ్ చేశారు. ఈ కేసులో పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా అవసరమైన చట్టాలను ఉపయోగించి కఠినంగా నిందితులను శిక్షించాలని కోరారు. మగవారు సైతం ఇలాంటి తప్పుడు పద్ధతులు అవలంబించిన్నప్పుడు ఇలాంటి శిక్షలే వేస్తారా? అని ప్రశ్నించారు.