Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేఏసీ చైర్మెన్ రాచాల యుగంధర్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్యార్థుల సమస్యలు పట్టించుకోని మహాత్మ జ్యోతిభా పూలే బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శిని మార్చాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం హైదరాబాద్లోని దామోదర్ సంజీవయ్య సంక్షేమ భవన్ముందు బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లి దండ్రులతో ఆందోళన చేపట్టారు. మంచి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గురు కులాలను ఏర్పాటు చేస్తే..ఆ సంస్థ కార్యదర్శి కార్యాలయంలో అందు బాటులో ఉండటం లేదని తెలిపారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థుల అవసరాలు తీరక తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని విమర్శించారు. పాఠశాలలు ప్రారంభమై నాలుగు నెల్లు కావస్తున్నా ఆయా పాఠశాలల్లో సీట్ల భర్తీకి చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనతో పాటు సిబ్బంది కూడా కార్యాలయానికి రావటం లేదని ఆరోపించారు. జాయింట్ సెక్రటరీ పోస్టు నెలల తరబడి ఖాళీగా ఉందనీ, ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జెఏసి నాయకులు మహేందర్ నాయుడు, శేఖర్ గౌడ్, విజయభాస్కర్, రమేష్, వెంకటేశ్వర్లు, సతీష్ తదితరులు పాల్గొన్నారు