Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్ సోమేశ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చిన్న ఆలోచనతో పెద్ద మార్పునకు నాంది పలకవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో అఖిల భారత సర్వీసులు, కేంద్ర ప్రజా సర్వీసుల అధికారుల 15 వారాల ఫౌండేషన్ కోర్స్ శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మేటి ఆలోచనతో ప్రజోపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టాలని ఉన్నా వ్యవస్థలోని పలు అవరోధాలు, ఆర్ధిక పరిమితుస రీత్యా ఆ దిశగా అడుగులు వేయలేని పరిస్థితులు ఎదురవుతాయని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ఆశయ సిద్ధితో ముందుకు సాగడం ద్వారా అవరోధాలను అధిగమించాలని సూచించారు. ఇదే సమయంలో వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనివ్వాలనీ, మంచి మిత్రులను కలిగి ఉండాలనీ, పుస్తక పఠనం మరువొద్దని సూచించారు. డాక్టర్ మర్రి చెన్నా రెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డీజీ బెన్హర్ మహేష్ దత్ ఎక్కా అధ్యక్షోపన్యాసం చేశారు. యువ అధికారులు శిక్షణ సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వి నియోగం చేసుకుని ప్రజా సేవలో నైపుణ్యతను పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శిక్షణా కార్యక్రమం ఇన్ఛార్జీ కోర్సు డైరెక్టర్ కె.తిరుపతయ్య, అదనపు కోర్సు డైరెక్టర్ డాక్టర్ రావులపాటి మాధవి, డాక్టర్ అబ్బాస్ అలీ, శ్రీదేవి అయలూరితో పాటు సంస్థలోని అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు.