Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పొగాకు ఉత్పత్తులను నిషేధించాలన్న నిషేధిస్తూ ప్రభుత్వ ఆదేశాల అమలును సుప్రీంకోర్టు నిలిపివేసిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా వెలువరించిన సర్క్యులర్‌ను పోలీసులు హైకోర్టుకు నివేదించారు. ఉన్నత న్యాయస్థానాల ఉత్తర్వుల సారాంశాన్ని పోలీసులకు తెలియజేసేలా, వారిని చైతన్యపరిచేలా సర్క్యులర్ వెలువడిందని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఈ వివరాలను న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత రికార్డుల్లో నమోదు చేశారు. చట్ట ప్రకారం బిల్లులు చెల్లించి కొనుగోలు చేసిన పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేయడం అన్యాయమంటూ నాగర్‌కర్నూల్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, హైదరాబాద్ జిల్లాలకు చెందిన వ్యాపారులు రిట్లు దాఖలు చేశారు. వీటిని విచారించిన హైకోర్టు న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలనీ, లేదంటే డీజీపీ స్వయంగా విచారణకు వచ్చి వివరణివ్వాలంటూ మంగళవారం ఆదేశించారు. కోర్టులు వెలువరించే ఉత్తర్వులంటే లెక్క లేకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం ఆఘమేఘాలపై సర్క్యులర్ జారీ చేసి హైకోర్టుకు అందజేసింది.
సంతృప్తిని వ్యక్తం చేసిన హైకోర్టు, దాన్ని అమలు చేసే విధంగా పోలీసుల్లో చైతన్యం తీసుకురావాలని ఆదేశించింది.