Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ రైతాంగ పోరాటం, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిదని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బాపూజీ వర్ధంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్లోని అరణ్య భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ తొలితరం పోరాటయోధుడని తెలిపారు. ఆఖరి శ్వాస వరకు తెలంగాణ కోసం పారాడిన బాపూజీని స్మరించుకోవాలనే తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకోవడమేనని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గొప్ప నాయకులను, గొప్ప వ్యక్తులను వారి త్యాగాలను స్మరించు కోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారి జయంతులను అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామంలో జన్మించి, పీడిత ప్రజల విముక్తి కోసం బహుముఖ పోరాటం చేసిన బాపూజీ నేటి తరం యువతకు ఆదర్శనీయుడని తెలిపారు.