Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీం (ఎన్ఎంఎంఎస్ఎస్)కు 2022-23 విద్యాసంవత్సరంలో కొత్తగా, ఇంతకుముందే ఎంపికైన అభ్యర్థులు పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 30 వరకు గడువున్నది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం సకాలంలో విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని కోరారు.