Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
సంచలనం రేపిన లిక్కర్ స్కామ్‌కు సంబంధించి హైదరాబాద్ లో దర్యాప్తు జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తమ విచారణను ఢిల్లీకి మార్చినట్టు తెలిసింది. రెండ్రో జుల క్రితం ఈ స్కామ్‌కు సంబంధించి కరీంనగర్‌కు చెందిన బిల్డర్ శ్రీనివాస్‌రావును ఏడు గంటల పాటు విచారించిన ఈడీ అధికారు లు తాజాగా ఆయనను విచారణ కోసం ఢిల్లీకి రావాలంటూ నోటీసులు జారీచేశారు. బుధవారం నగరంలో ఈ స్కామ్‌కు సంబంధించి జానా ట్రావెల్స్ యజమానితో పాటు టెరినో టెక్నో సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన ఎండీని కూడా ఈడీ అధికారులు విచారించినట్టు తెలిసింది. ముఖ్యంగా, రామచంద్రన్ పిళ్లైకి చెందిన లిక్కర్ వ్యాపారంతో సంబంధాలు కలిగి ఉన్న శ్రీనివాస్‌రావ్.. పిళ్లైకి సంబంధించిన నిధులను హవాలా ద్వారా ఢిల్లీకి తరలించినట్టు ఈడీ విచారణలో వెల్లడైంది. అంతేగాక, జానా ట్రావెల్స్ ద్వారా స్పెషల్ ఫ్లైట్ టికెట్లను బుక్ చేసి దాని ద్వారా భారీ మొత్తంలో డబ్బులను ఢిల్లీకి తరలించేవాడని కూడా శ్రీనివాస్‌రావుపై ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. మొత్తంమ్మీద రామచంద్రన్ పిళ్లైకి చెందిన ఏడు కంపెనీలలో డైరెక్టర్‌గా కూడా శ్రీనివాస్‌రావు ఉన్నట్టు ఈడీ నిర్ధారణకు వచ్చింది. రెండో విడతగా గత నాలుగు రోజులుగా హైదరాబాద్‌లో అభిషేక్రావ్, గండ్ర ప్రేమ్‌కుమార్, శ్రీధర్‌తో పాటు ఆడిటర్ బుచ్చిబాబు కార్యాల యాలు, ఇండ్లను సోదా నిర్వహించిన ఈడీ అధికారులు ప్రస్తుతం ఇక్కడి విచారణను ముగించినట్టు తెలిసింది. తదుపరి విచారణను ఢిల్లీలో కొనసాగిస్తూ ఇక్కడ తాము సోదాలు నిర్వహించి వ్యక్తులు, ఇతర అనుమానితులను ఢిల్లీకి విచారణ నిమిత్తం రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది.