Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, పదోన్నతులు, బదిలీలు చేపట్టాలనీ, విద్యాశాఖను సమీక్షించాలని కోరుతూ ట్రూ టీచర్స్ కోయాలేశన్ (టీటీసీ) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈనెల 27న హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీసీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పాపగారి ఆశీర్వాదం, కులేరి ప్రేమ్‌సాగర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని చాలా పాఠశాలల్లో నియామకాల్లేక బోధన కుంటుపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. చాలా ఏండ్లుగా పదోన్న తుల్లేక ఉపాధ్యాయులు ఎస్జీటీలుగానే రిటైర్ అవుతున్నారని తెలిపారు. గురుకుల పాఠశాలల్లో సరైన పర్యవేక్షణ లేక లక్షలాది మంది పిల్లలు అనా రోగ్యం బారిన పడి మరణిస్తున్నారని పేర్కొన్నారు. వాటికి నిరసనగా సమస్య లను పరిష్కరించాలని కోరుతూ నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు వివరించారు.