Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్టీసీఈఏ అధ్యక్షులు సంతోష్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ తేదీలను మార్చాలని టీఎస్ టీసీఈఏ అధ్యక్షులు అయినేని సంతోష్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్, ఉన్నత విద్యామండలి చైర్మెన్‌కు బుధవారం ఆయన ఆన్లైన్లో వినతిపత్రం పంపించారు. రాష్ట్రంలో వచ్చేనెల మూడున సద్దుల బతుకమ్మ, ఐదున దసరా పండుగలున్నాయని వివరించారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను పరిశీలిస్తే వచ్చేనెల నాలుగున సీట్ల కేటాయింపు, ఆ తర్వాత ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్‌కు చివరి తేది అదేనెల ఎనిమిదిన ఉందని పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు, తల్లితండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశముందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్యలుంటాయని పేర్కొన్నారు.