Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మద్దికాయల అశోక్ ఓంకార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎంసీపీఐ(యూ) జాతీయ ఐదో మహాసభలు నవంబర్ 12 నుంచి 15 వరకు బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో జరుగుతాయని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఓంకార్ భవన్లో లో ఆ పార్టీ కేంద్ర కమిటీ సమావేశం మహేందర్ నేహ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అశోక్ మాట్లాడుతూ మహాసభలకు 13 రాష్ట్రాల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. జాతీయస్థాయిలోని వామపక్ష, సామాజికవేత్తలను సౌహార్ధ సందేశం ఇంచ్చేందుకు ఆహ్వానిస్తున్నామని అన్నారు. దేశం లో వామపక్ష, సామాజిక శక్తుల ఐక్యతే లక్ష్యంగా ఈ మహాసభలను నిర్వహిస్తామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతోన్మాదం, ఫాసిజంతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నదని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో దేశాన్ని పాలిస్తూ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ తెచ్చిన నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలనే బీజేపీ సర్కారు వేగంగా అమలు చేస్తున్నదని అన్నారు. జెండాలు వేరైనా కాంగ్రెస్, బీజేపీ ఎజెండా ఒక్కటేనని విమర్శించారు. దేశంలో మతవిభజన రాజకీయాలు చేస్తూ విపక్షాలను బలహీన పరిచేలా ఈడీ, సీబీఐ, ఐటీని ప్రయోగిస్తున్నదని అన్నారు. ఆ పార్టీ ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా బలమైన ప్రజాఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) పొలిట్‌బ్యూరో సభ్యు లు కిరణ్జిత్ సింగ్ షేఖాన్, వల్లెపు ఉపేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, కేరళ కార్యదర్శి శ్రీ కుమార్, ఏపీ కార్యదర్శి కాటు నాగభూషణం పాల్గొన్నారు.